[t4b-ticker]

చండూరు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలి.

*రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి .

*సిపిఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్.

ప్రతిపక్షం చండూరు సెప్టెంబర్ 08: చండూరు మండలాన్ని వెంటనే కరువు మండలం గా ప్రకటించి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సిపిఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చండూరులో మాట్లాడుతూ మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులకు ఎల్లీనో ప్రభావం వలన తీవ్రంగా నష్టపోవడం జరిగిందని అన్నారు చండూరు మండలంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి కరువు మండలం గా ప్రకటించి పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 20వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.భారత కమ్యూనిస్టు పార్టీ రైతుల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.

Spread the love

Related News

Latest News