- దళితుడు స్పీకర్ కావడం జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ విమర్శలు
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్ సెప్టెంబర్ 08: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై బీఆర్ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పేర్కొన్నారు. కరీంనగర్ లో మీడియా సమావేశం లో అయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాత మధు ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తాత మధు ను భర్తరఫ్ చేసే వరకు ఆందోళన చేపడుతామని కరీంనగర్ అర్బన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.





























