ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన డబుల్ బెడ్ రూమ్ వాసులు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 20: మెదక్ జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ లో సమస్యలనువెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ వాసులు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరిగిందని అందులో సీసీ రోడ్డు లేకపోవడం మురికి కాలువలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలం వచ్చిందంటే రోడ్డుపైన నడవలేని పరిస్థితి ఉంటుందని పాములు తేళ్లు తిరుగుతుంటాయని వారు ఆరోపించారు ముఖ్యంగా మంచినీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భగీరథ మంచినీళ్లు డబుల్ బెడ్ రూమ్ పైకి రావడం లేదని వారు తెలిపారు వచ్చే నీళ్లు కింది నుండి ఎత్తుకోవాల్సిన అవసరం ఉందని దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇప్పటికైనా మంచినీటి వస్తుంది కల్పిస్తూ సిసి రోడ్డు మంజుల చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు యాదగిరి. స్వప్న. రేణుక. శేఖర్ ఎండి మసీద్ తదితరులు పాల్గొన్నారు.



















