ప్రతిపక్షం, జూలై 20: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించారు. రోహిత్ తనకు ఇదే చివరి మ్యాచ్ అని జట్టు సభ్యులతో ఎలాంటి విషయం చెప్పలేదని స్పష్టం చేశారు.
‘రోహిత్ తన చివరి మ్యాచ్ ఇదేనని మాతో ఏమీ మాట్లాడలేదు. ఈ విషయంపై మీడియాలోనే ప్రచారం జరుగుతోంది. జట్టులో మాత్రం రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని గిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి పిచ్ అనుకూలంగా లేకపోయినా రోహిత్ శర్మ అద్భుతంగా ఆడారని గిల్ ప్రశంసించారు. మరోవైపు మ్యాచ్ చివరి దశలో భారత బౌలర్లు ఎక్కువ పరుగులు ఇవ్వడం జట్టుకు ప్రతికూలంగా మారిందని పేర్కొన్నారు.

















