జపాన్ ఓపెన్‌ విజేత పీవీ సింధుకు సీఎం రేవంత్ అభినందనలు

ప్రతిపక్షం, జూలై 20: జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కెరీర్‌లో తొలి సూపర్-750 టైటిల్ సాధించడం భారత క్రీడా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పీవీ సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News