రెండు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ప్రతిపక్షం, జూలై 20: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దుద్యాల్ మండలం హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో పనులపై సమీక్ష నిర్వహిస్తారు.

రాత్రి కొడంగల్‌లో బస చేయనున్న ముఖ్యమంత్రి.. 22వ తేదీన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం కొనసాగుతున్న తీరును పరిశీలిస్తారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Spread the love

Related News

Latest News