ప్రతిపక్షం, జూలై 21: హైదరాబాద్‌లోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.
ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఆయా కేటగిరీల్లో 30 శాతం ఇళ్లను మహిళలకు కేటాయిస్తారు. ఇళ్లను మహిళల పేరిటే రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ప్రాంతంలోనే నివాసం ఉండాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.


















