ప్రతిపక్షం, జూలై 21: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కార్పీడియం పబ్‌లో ఓ మహిళపై దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. తనను వదిలేయాలని వేడుకున్నప్పటికీ నిందితుడు దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

















