ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో ట్విస్ట్‌!

ప్రతిపక్షం, జూలై 21: తోటి మహిళా అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఆయన విషం తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే వైద్య పరీక్షల్లో ఆయన శరీరంలో విషపదార్థాలు లేవని, అధికంగా మద్యం సేవించడం వల్లే స్పృహ కోల్పోయినట్లు సమాచారం. సానుభూతి పొందేందుకే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News