కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జూలై 21: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లో అమ్మనగర్ పాంగ్రా- నిజామాబాద్ ను కలుపుతూ రూ.10 కోట్లతో నిర్మించిన వంతెన ను వారు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. నిజామాబాద్ నగరానికి వెళ్లడానికి దూరాభారం తగ్గే విధంగా అమ్మనగర్ పాంగ్రా వంతెన ను రూ.10 కోట్ల 80 లక్షలతో నిర్మించడం జరిగిందన్నారు. ఫలితంగా మాధవ్ నగర్, అమ్మనగర్, తదితర గ్రామాల ప్రజలకు నగరంలోకి ప్రయాణించేందుకు దూరబారం తగ్గుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవంలో నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి , మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News