ప్రతిపక్షం, జూలై 21: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. టీకేఆర్ కళాశాల సమీపంలో ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కళ్లలో కారం చల్లి అనంతరం కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సూరి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో సూరి చేతిలో హత్యకు గురైన వ్యక్తి సోదరుడు అఫ్రోజ్ ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.
ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు, మృతుడి కాల్ డేటా, నిందితుల కదలికలపై దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనుక ఉన్న పూర్తి కుట్రను వెలుగులోకి తీసుకురావడంతో పాటు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

















