సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ప్రతిపక్షం, జూలై 21: సంగారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజాంపేట మండలం బాచుపల్లి సమీపంలోని 161వ జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు నాలుగేళ్ల చిన్నారి ఉన్నట్లు సమాచారం.

మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కుటుంబం స్కార్పియోలో హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కార్పియో పల్టీలు కొట్టినట్లు ప్రాథమికంగా సమాచారం. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News