ప్రతిపక్షం, జూలై 23: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల ఆందోళనను అణిచివేసే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె విమర్శించారు.
ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కవిత.. “బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని విమర్శించారు. సీసీ కెమెరాలు నిలిపివేయడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం అమానుష చర్య అని ఆమె మండిపడ్డారు.
అదేవిధంగా గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపైనా ఆమె స్పందించారు. అగ్రిగేటర్ సంస్థలు కార్మికులకు న్యాయమైన ఆదాయం అందించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్ల హక్కులను పరిరక్షించేలా స్పష్టమైన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు.

















