ప్రతిపక్షం, జూలై 23: ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు బాలీవుడ్ నటి ఆలియా భట్ మద్దతు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని, వాటిని చూసి తన గుండె ముక్కలైందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి వెనుక ఒక కల, కుటుంబ సభ్యుల త్యాగాలు, ఎన్నో ఆశలు ఉంటాయని ఆలియా అన్నారు. వారు తమ భవిష్యత్తు కోసమే కాకుండా రాబోయే తరాలకు మెరుగైన మార్గాన్ని నిర్మించేందుకు పోరాడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ధైర్యం, సంకల్పం తనకు స్ఫూర్తినిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
“విద్యార్థులే దేశ భవిష్యత్తు. వారి గొంతును మనం నిజంగా వింటున్నామా?” అని ప్రశ్నించిన ఆలియా భట్, యువత సమస్యలను సున్నితంగా అర్థం చేసుకుని వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తన పోస్టులో పేర్కొన్నారు.

















