[t4b-ticker]

పిలాయిపల్లి కాల్వ ప్రక్షాళనకు శ్రీకారం.

*పిలాయిపల్లి కాల్వలో గుర్రపుడెక్క తొలగింపు పనులకు శ్రీకారం.

*రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులతో పనులు ప్రారంభం.

*కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు .

ప్రతిపక్షం, చౌటుప్పల్ సెప్టెంబర్ 18: చౌటుప్పల్ మండల రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులపై మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. బండరావిరాల నుంచి పెద్దకాపర్తి వరకు పిలాయిపల్లి కాల్వలో పేరుకుపోయిన గుర్రపుడెక్క ఆకులను తొలగించే పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి సహకారంతో, దివిస్ లేబొరేటరీస్ యాజమాన్యం సౌజన్యంతో సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.20 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. బండరావిరాల వద్ద ఇరిగేషన్ ఈఈ రాధాకృష్ణ, డీఈ కృష్ణారెడ్డితో కలిసి చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఆకుల ఇంద్రసేనారెడ్డి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. పిలాయిపల్లి కాల్వలో గుర్రపుడెక్క పూర్తిగా పేరుకుపోవడంతో కాల్వ ద్వారా నీరు సక్రమంగా రాక చౌటుప్పల్ మండల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి, ప్రత్యేక చొరవతో దివిస్ యాజమాన్యంతో మాట్లాడి రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

కాల్వలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పూర్తయితే నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగి రైతులకు సాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రైతుల సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, సహకరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి, సీఎస్ఆర్ నిధులు అందించిన దివిస్ లేబొరేటరీస్ యాజమాన్యానికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమిడి ప్రదీప్‌జీ, పోచంపల్లి సింగిల్ విండో చైర్మన్ పాక మల్లేష్‌యాదవ్, జూలూరు సింగిల్ విండో చైర్మన్ కళ్లెం రాఘవరెడ్డి, సింగిల్ విండో వైస్‌చైర్మన్ చెన్నగోని అంజయ్యగౌడ్, చౌటుప్పల్, పోచంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, ఉప్పునూతల వెంకటేష్‌యాదవ్, సర్పంచులు చిన్నకొండూరు తీగుళ్ల చంద్రయ్య, పోచంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాసుల అంజయ్యగౌడ్, ఫిలాయిపల్లి సర్పంచ్ పెరుమాండ్ల మహాలక్ష్మి దానయ్య, మాజీ ఎంపీటీసీ బద్దం కొండల్‌రెడ్డి, జిల్లా నాయకులు నల్ల నరేందర్‌రెడ్డి, ఢిల్లీ శేఖర్‌రెడ్డి, చేవెళ్లి కృష్ణ, సంతు, ఫకీరు యాదిరెడ్డి, దివిస్ అధికారి గోపి తదితరులతో పాటు చౌటుప్పల్, పోచంపల్లి మండలాల రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News