ఢిల్లీలో నిరసనలు.. కేంద్రం సంచలన నిర్ణయం

ప్రతిపక్షం, జూలై 23: ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ప్రత్యేక నిర్బంధ అధికారాలను మంజూరు చేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం, జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులను అవసరమైతే ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు చేయకుండానే నిర్దిష్ట నిబంధనల మేరకు నిర్బంధించే అధికారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ వినియోగించుకోవచ్చు. ఈ అధికారాలు అక్టోబర్ 18 వరకు అమల్లో ఉంటాయని కేంద్రం వెల్లడించింది.

కాగా, ఈ గెజిట్ నోటిఫికేషన్‌పై జులై 15 తేదీ నమోదై ఉండటం గమనార్హంగా మారింది. ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love

Related News

Latest News