ప్రతిపక్షం, జూలై 23: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ భూముల్లో జోక్యం చేసుకున్న వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ భూముల్లోకి హైడ్రా అధికారులు లేదా పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశిస్తే వారిని అదుపులోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆర్మీ భూముల్లోకి ప్రవేశించే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని సూచించింది. లోతుకుంట ప్రాంతంలోని రక్షణ శాఖ భూముల విషయంలో ఎలాంటి జోక్యాన్నీ సహించబోమని స్పష్టం చేసింది.
భవిష్యత్తులో కూడా ఆర్మీ భూముల జోలికి ఎవరైనా వస్తే వెంటనే కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆర్మీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


















