ధర్మేంద్ర రాజీనామాపై బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది: రేవంత్

ప్రతిపక్షం, జూలై 23: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకుని సీబీఎస్‌ఈ పరీక్షల కాంట్రాక్ట్ పొందిందని, అది కేటీఆర్ బినామీ కంపెనీ అని ఆరోపించారు.

ఆ సంస్థ తప్పిదాల ద్వారానే నీట్ కుంభకోణం జరిగిందని సీఎం పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Spread the love

Related News

Latest News