ప్రతిపక్షం, జూలై 24: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటైన తొలి ఏకాదశిని భక్తులు రేపు భక్తిశ్రద్ధలతో ఆచరించనున్నారు. ఈ సందర్భంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి, శుభ్రమైన పసుపు రంగు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరమని పురోహితులు సూచిస్తున్నారు.
ఈ రోజున శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీ దేవిని భక్తితో పూజించి ఉపవాసం ఉండాలని, పూజలో తులసి దళాలను తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. మాంసాహారాన్ని పూర్తిగా వర్జించడంతో పాటు గోర్లు, జుట్టు కత్తిరించడం వంటి పనులను నివారించాలని సూచిస్తున్నారు. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తూ రోజంతా దైవనామ స్మరణలో గడిపి, వీలైతే రాత్రి జాగారం చేస్తూ విష్ణు సహస్రనామం, భజనలు, పురాణ పారాయణం చేయడం ఎంతో పుణ్యఫలితాన్ని ఇస్తుందని పురోహితులు పేర్కొంటున్నారు. తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించి సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం.

















