సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

ప్రతిపక్షం, జూలై 24: రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ శ్రీ వరుణ యాగంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో నిర్వహిస్తున్న వరుణ యాగాల్లో భాగంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, జలాశయాలు నిండాలని, రైతులు ఆనందంగా పంటలు పండించాలన్నారు. ప్రకృతి సమతుల్యత నెలకొని తెలంగాణ సస్యశ్యామలంగా మారాలని, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీ వరుణ దేవునికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

యాగంలో ప్రత్యేక హోమాలు నిర్వహించి రాష్ట్ర శ్రేయస్సు కోసం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవాలయ కమిటీ చైర్మన్ అర్జున్ యాదవ్, కమిటీ సభ్యులు దినేష్, రాజేష్, జగదీష్, సుదర్శన్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News