మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, జూలై 24: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ csi చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ ప్రార్థనా కార్యక్రమానికి మెదక్ బిషప్ కమిస్సరీ రేవ. జయనంద్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని దేవునికి ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.మెదక్ డయాసిస్ పరిధిలోని మూడు జిల్లా చర్చి కౌన్సిళ్ల (డీసీసీ) ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మెదక్ లే సెక్రటరీ పెద్ది దేవసహాయ్, ప్రాపరేటి కన్వీనర్ మంత్రి సొలొమోను,మెదక్ డీసీసీ చైర్మన్ జార్జి ఎబినేజర్, వైస్ చైర్మన్ దేవదాస్, డయాసిస్ గురువులు రేవ. గడ్డి ప్రేమ్‌కుమార్, మెదక్ ప్రెస్బిటర్ ఇన్‌చార్జి రేవ. శాంతయ్య, మెదక్ చర్చి సెక్రటరీ గెలన్ చిత్తరంజన్, గంట సంపత్, సుశీల్, నోబుల్సన్ తదితరులు పాల్గొన్నారు.


















