- విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నుల పంపిణీ
ప్రతిపక్షం,కోహెడ, జూలై 24: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి జన్మదిన వేడుకలను కోహెడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గవ్వ వంశీధర్ రెడ్డి యువసేన మండల అధ్యక్షుడు మహమ్మద్ ఒవైస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జన్మదినాన్ని సేవా దినోత్సవంగా జరుపుకున్నారు.ముందుగా అంబేద్కర్ చౌరస్తాలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చుతూ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గవ్వ వంశీధర్ రెడ్డి ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 15 సంవత్సరాలుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.అనంతరం కోహెడ మండల కేంద్రంలోని ఎన్‌టీఆర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేసి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గవ్వ వంశీధర్ రెడ్డి అభిమానులు, యువసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


















