ధర్మేంద్ర రాజీనామా.. బీజేపీ విలువలకు నిదర్శనం: బండి సంజయ్

ప్రతిపక్షం, జూలై 25, హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం “నేషన్ ఫస్ట్, పార్టీ నెక్ట్స్, సెల్ఫ్ లాస్ట్” అనే భావనపై నడుస్తుందని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆ విలువలకు అద్దం పడే నిర్ణయమని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతూ కేంద్ర మంత్రిగా అనేక కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారని బండి సంజయ్ కొనియాడారు. దేశ ప్రయోజనాలే పార్టీ కంటే, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ముఖ్యమనే బీజేపీ సిద్ధాంతాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుందని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా అదే రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు.

ప్రజా జీవితంలో జవాబుదారీతనం, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న విధానమని బండి సంజయ్ అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్న నిర్ణయం పార్టీ నైతిక విలువలు, ప్రజాస్వామ్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Spread the love

Related News

Latest News