ప్రతిపక్షం, జూలై 25, వనపర్తి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గంధం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్. ఆదర్శ్ సురభిని కలిసి తెలంగాణలో రాబోయే అన్ని ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేసిందని, ప్రస్తుతం 2026లో కూడా అదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించడం వల్ల ఎస్సీ సమాజానికి న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అమలవుతున్న విధానాన్ని అనుసరించి, ఎస్సీలకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేసి ఎస్సీ సమాజానికి సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కొమ్ము సామేలు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బాబురావు, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం, ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బాల పీరు, నాలుగో వార్డు అభ్యర్థి గగనం శివతో పాటు ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















