ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 27: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త నందన్ నీలేఖని ఆధ్వర్యంలో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన చట్టాన్ని నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. నేటి నుంచి 45 రోజుల పాటు “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని, ఇతర రాజకీయ పార్టీల నేతలతో వేదికలు పంచుకోవద్దని ఆదేశించినట్లు సమాచారం.తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన ఫిర్యాదుల విచారణలో హెచ్ఆర్సీ అధికార పరిధిపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది
.

















