మరి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయరా? కిషన్‌రెడ్డి

ప్రతిపక్షం, జూలై 27: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ ఘటన జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అలాంటప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాట్లాడే ముందు రేవంత్‌రెడ్డి కూడా తన బాధ్యతను స్వీకరించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పేపర్‌ లీక్‌కు బాధ్యత వహించాల్సిందేనని, ఇప్పుడు ఇతరులకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశానికి నష్టం చేసే ఏ వ్యవస్థనైనా సహించబోమని, “నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్” అనే సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థతో పాటు అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News