ప్రతిపక్షం, జూలై 27: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను హనుమకొండ నుంచి యశోదా ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న కేసీఆర్, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

















