మహంకాళీ బోనాలకు శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జులై 27: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసిన పాలకమండలి ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 2న జరిగే బోనాల ఉత్సవం, ఆగస్టు 3న నిర్వహించే రంగం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.ఈ సందర్భంగా ఈవో మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామతీర్థ శర్మ, వేణుమాధవ శర్మ వేదమంత్రోచ్చారణలతో మంత్రిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవీవర ప్రసాద్, మంత్రి సోనాల్, మల్లిఖార్జున్, గంటా గీత, కిరణ్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News