- రూ.30 వేల ఆర్థిక సాయం.. ముగ్గురు పిల్లలకు ఉచిత విద్య ఏర్పాటు
ప్రతిపక్షం, జులై 27,వనపర్తి ప్రతినిధి: వనపర్తి పట్టణలోని 23వ వార్డు కౌన్సిలర్ పలుస శ్రీకర్ గౌడ్ మానవత్వాన్ని చాటుతూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చీర్ల శ్యామ్ సాగర్ (స్వామి) కుటుంబానికి రూ.30,000 ఆర్థిక సహాయం అందించారు.అంతేకాకుండా, శ్యామ్ సాగర్ ముగ్గురు పిల్లలకు ప్రైవేట్ స్కూల్‌లో ఉచితంగా విద్య అందేలా పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి ఫీజు పూర్తిగా మాఫీ చేయించారు.కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ వంతు సహకారం కొనసాగిస్తామని శ్రీకర్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మణి కలెక్షన్ శశి, రాము తదితరులు పాల్గొని శ్యామ్ సాగర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

















