[t4b-ticker]

అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలో విసిరేస్తాం: కేటీఆర్‌

ప్రతిపక్షం, జూలై 29: తెలంగాణలో హైడ్రా వ్యవస్థపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిల్డర్ల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కబ్జాదారులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా ముఖ్యమంత్రికి వేటకుక్కలా మారిందని, కమీషన్లు ఇవ్వని వారిపై మాత్రమే చర్యలకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.

ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తే హైడ్రా వ్యవస్థను రద్దు చేసి బంగాళాఖాతంలో విసిరేస్తామని ఢిల్లీలో వ్యాఖ్యానించారు

Spread the love

Related News

Latest News