[t4b-ticker]

రేవంత్‌ రెడ్డి ఉన్నాడనే ధైర్యంతో ఆంధ్రలో పంటలు సాగు

•కేసిఆర్ కు పేరు వస్తుందని కాళేశ్వరం నీళ్లు ఇవ్వొద్దని దుర్బుద్ధి కాంగ్రెస్ పాలకులది

•జూరాల వరద జలాలు సాగుకు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలి: మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి

•రైతుల మీద కాంగ్రెస్ కక్ష్య: మాజీ ఎమ్మెల్యే.ఆల వెంకటేశ్వర్ రెడ్డి

•నీళ్ల కోసం కాంగ్రెస్ తో కొట్లాడాల్సి వస్తోంది: మాజీ ఎమ్మెల్యే.చిట్టెం రామ్మోహన్ రెడ్డి

ప్రతిపక్షం, జులై 29,వనపర్తి ప్రతినిధి: ఎల్‌నినో ప్రభావం వల్ల కరువు రాలేదని, ఎల్లో కాంగ్రెస్ వల్ల కరువు వచ్చిందని, రేవంత్ రెడ్డి ఉన్నాడనే ధీమాతో ఆంధ్రా ప్రజలు పంటలు వేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే లు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించి ఆత్మకూరులో మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటి విడుదల చేయకపోవడంపై మండి పడ్డారు. ఆంధ్రకు నీళ్లు వదులుతాడని తెలుసు కాబట్టే అక్కడి రైతులు ధైర్యంగా పంటలు వేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డికి ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదని ఆరోపించారు.కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇస్తే కేసీఆర్ కి పేరు వస్తుందనే..దుర్బుద్ధి కాంగ్రెస్ పాలకులదని మండిపడ్డారు.

నీళ్ల వాడకంపై మంత్రులకు స్పష్టత లేదు

నీళ్ల వాడకం పై స్పష్టత లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని…వానలు లేకపోతే ఆలమట్టి 123 టీ ఏం సి , నారాయణ పుర ప్రాజెక్టు 30 టీ ఏం సి ల నీళ్లు ఎట్లా నిండాయని ప్రశ్నించారు.జూరాలతో సంబంధం లేకుండా తుంగభద్రతో శ్రీశైలంకు నాలుగు వందల టీ ఏం సి లు వస్తాయని..ఇవన్నీ కలుపుకుంటే సరిపడా నీళ్ళు వస్తాయని పేర్కొన్నారు.కర్ణాటకలో 17 లక్షల ముప్పై వేల ఎకరాలకు సరిపోను నీళ్ళు ఉన్నాయని,పంటలు సాగైతే వర్షం పడకపోయినా జూరాలకు ఐదు వేల క్యూసెక్కుల నీళ్లు వస్తాయని తెలిపారు.పాలమూరులో కృష్ణ నది మీద ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు కలిపిన రోజుకు ఒక టీఎంసి మించి వాడుకోలేం..అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తో రోజు రెండు టీ ఏం సి లు ఎత్తిపోసేలా డిజైన్ చేశామని..పాలమూరు పనులు తొంభై శాతం పూర్తి చేస్తే పాలమూరు బిడ్డ సీఎం.రేవంత్ రెడ్డి రెండున్నర ఏండ్లు పడావు పెట్టారని ఎద్దేవా చేశారు.మనకు ఉన్న నీళ్ళు పంటలకు ఇవ్వొచ్చని అవగాహన లేకపోతే..మంత్రులు ఇరిగేషన్ అధికారులు మాట్లాడి తెలుసుకోవాలని హితవు పలికారు.రైతులు నీళ్ళు అడిగే పంటలు వేయొద్దని చెప్తారా?భారీ వర్షాలు పడ్డ గతేడాది జూరాల కింద పోయిన యాసంగికి క్రాప్ హాలిడే ఇచ్చారని?నీళ్ళు ఇవ్వకుంటే క్షమించేది లేదని హెచ్చరించారు.జూరాల నుండి నీళ్లను కిందకు శ్రీశైలంకు వెళ్ళేలా చేస్తున్నారని,ఈ సీజన్ మొత్తం కాలువలు విడవాల్సిందేనని వాపోయారు.బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమం చేపడతాం అనగానే కాలువలకు నీళ్ళు వదిలారని,నీళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తామని రైతులకు మద్దతుగా నిలబడతామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.పాలమూరుకు నీళ్ళకు మించి ఏం ఉండదు.. దీంట్లో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.

రైతులపై కాంగ్రెస్ కు కక్ష ఎందుకు?:మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

వరద ప్రారంభమైన మూడు రోజులకు పంప్ లు స్టార్ట్ చేశారని,కోయిల్ సాగర్ లిఫ్ట్ ఒకటే పంప్ ఆన్ చేశారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.ఇప్పటికే రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని,కాంగ్రెస్ కుట్ర చేస్తుందనే అనుమానం కలుగుతుందన్నారు.పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయితే డెబ్బై టీఏంసిలు నిల్వ చేసుకునే వాళ్ళమని,పాలమూరు సీఎం జిల్లాకు ఒరగబెట్టింది ఏంటని?వచ్చిన నీళ్లను వచ్చినట్లుగా చెరువులు, రిజర్వాయర్లు నింపుకోవాలి కదా? అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్ల కోసం కోట్లాడాల్సి వస్తుంది:మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

గతేడాది యాసంగిలో క్రాప్ హాలిడే…ఇప్పుడు వానాకాలం క్రాప్ హాలిడే ఇచ్చేలా ఉన్నారని,సీజన్ ప్రారంభమైన రైతులకు సాగునీటి విడుదలపై స్పష్టత లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఇష్టారాజ్యంగా చేస్తే రైతులు చూస్తూ ఊరుకోరు అని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ చైర్మెన్ గాయిత్రి రవికుమార్,మాజీ జెడ్పి వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్,పలుస.రమేష్ గౌడ్,మాజీ జెడ్పిటి.సి విశ్వేశ్వర్, ప్రశాంత్,వీరేశలింగం,లక్ష్మీకాంత్ రెడ్డి, మందరామకృష్ణ, జానకి రాములు, రియాజ్, వేణుగోపాల్ రెడ్డి ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News