నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్న చండూరు మండలం బిఆర్ఎస్ నాయకులు.
ప్రతి పక్షం చండూరు ఆగస్టు 24: బిఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం అందజేసి చండూరు మండలం బిఆర్ఎస్ నాయకులు. ఇటీవల అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిన నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందినగ్రామశాఖ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు, గ్రామపంచాయతీ 7 వార్డు మెంబర్ రేవెల్లి నరేష్ అనారోగ్య కారణంతో అకాల మరణం చెందారు. బిఆర్ఎస్ పార్టీ కోసం తన కుటుంబాన్ని సైతం వదులుకొని అహర్నిశలు కష్టపడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో చండూరు మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న 10 వేలు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు 20 వేలు, చండూరు మండలం బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు 10 వేల రూపాయలు సోమవారం నరేష్ కుటుంబానికి అందజేశారు. పెద్ద మనసుతో మా కుటుంబానికి అండగా నిలిచిన చండూరు మండలం బిఆర్ఎస్ నాయకుల అందరికీ పేరుపేరునా నరేష్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కట్కూరి సత్తయ్య, చండూరు మండలం బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అనపర్తి శేఖర్, వరకాల శ్రవణ్, ఎండి సత్తార్, వర్కాల నరసింహ ,వర్కాల అంబేద్కర్, చేదురవెల్లి లింగస్వామి, వరికుప్పల మహేష్ ,కాశీమల్ల అనిల్, కుటుంబ సభ్యులు రేవల్లి చంద్రయ్య,రేవల్లి శ్రీను రేవెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.





























