విద్య ను దూరం చేసే ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి
శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి. SBTETను బలోపేతం చేయాలి.
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా గర్ల్ కన్వీనర్ సమ్రీన్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 24: కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ చేయాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాలిటెక్నిక్ హాస్టల్ నుండి వర్షాన్ని సైతం లెక్క చేయక కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సమ్రీన్ మాట్లాడుతూ
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబించడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.జీ.వో.ఎం.ఎస్.నెం: 97/ 2026 లో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కీల్ యూనివర్శీటీ జాతీయ విద్యావిధానం లో భాగంగా ఏర్పాటు చేశారు. ఆనంద్ మహేంద్ర ను చైర్మన్ గా ఉన్న (పిపిపి)లో భాగంగా నడుస్తున్న యూనివర్శీటిలో విలీనంచేస్తే ప్రభుత్వ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్య ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా వీటిని యంగ్ ఇండియా స్కీల్ యూనివర్శీటీ లో వీలీనం చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదని, తక్షణమే ప్రభుత్వం తమకు వీలీనం చేసే ఉద్దేశ్యం లేదని ప్రకటన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యకు ” స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్”(SBTET) కీలకమైన సంస్థ అని, దాని పాత్రను కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని SFI కోరుతుంది.
ప్రభుత్వం శక్తి పాలసీ తీసుకుని వస్తే విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్ళాడానికి అవకాశం లేక అలాగే వారి అకడమిక్స్ ఏవరు నిర్ణయించాలో అర్థం కానీ పరిస్థితి ఉంటుందని, ఎస్బీటిఈటీని కోనసాగించి, దాని పరిధిలోని పాలిటెక్నిక్ విద్యను కోనసాగించాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ల్యాబొరేటరీలు, వర్క్‌షాప్‌లు, హాస్టళ్లు, భవనాలు, బోధనా సిబ్బంది తదితర అవసరాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కల్పించాలని SFI డిమాండ్ చేస్తుంది.విద్యార్థులకే కాకుండా అదేవిధంగా ఇది అధ్యాపకులకు కూడా ప్రమాదంగా మారిందని తెలిపారు పాలిటెక్నిక్ అధ్యాపకులు, సిబ్బందికి ప్రత్యేక సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని, విద్యార్థుల ఫీజులను పెంచకుండా చర్యలు తీసుకోవాలని SFI కోరింది. SC, ST, BC, మైనారిటీ, EWS విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నాణ్యమైన అధ్యాపకులు, ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, హాస్టళ్లు, పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక కరిక్యులమ్‌తో పాటు ఉన్నత విద్యకు వెళ్లేందుకు సరైన అకాడమీక్ స్టాండర్స్ మరియు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలని SFI సూచించింది.తక్షణమే రేవంత్ రెడ్డి ఈ జీ.వో.నెం :97 వెనక్కి తీసుకుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ బాధ్యులు గణేష్ మెదక్ పాలిటెక్నిక్ విద్యార్థులు అక్షయ, సంధ్య, అరుణ్, సాహిత్య, అలాగే గోమారం పాలిటెక్నిక్ విద్యార్థులు తదితర విద్యార్థులు పాల్గొన్నారు.





























