[t4b-ticker]

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్‌లైన్.. ప్రభుత్వం కీలక చర్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 27: నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అక్కడ ఉన్న తెలంగాణ వాసుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తోంది.

నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరగక ఆందోళన చెందుతున్న తెలంగాణ వాసులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. బాధితుల వివరాలను సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైన సహాయం అందేలా సమన్వయం చేయనున్నట్లు వెల్లడించింది.

సహాయం కోరే సమయంలో నేపాల్‌లో ఉన్న వ్యక్తి పూర్తి పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, ప్రస్తుతం లేదా చివరిగా తెలిసిన ప్రాంతం, పర్యటన నిర్వాహక సంస్థ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు నంబర్లను అందించాలని అధికారులు సూచించారు. ఈ వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఆచూకీ, క్షేమ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నాలు వేగవంతం చేయనున్నారు.

హెల్ప్‌లైన్ నంబర్లు:

📞 వందన: 9871999044
📞 సి.హెచ్. చక్రవర్తి: 9949351270
📞 జి. రక్షిత్ నాయక్: 9618597969

హెల్ప్‌లైన్‌కు అందే ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యతా క్రమంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా హెల్ప్‌లైన్‌ను సంప్రదించి పూర్తి వివరాలు అందించాలని సూచించింది.

నేపాల్‌లో వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం కొనసాగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను సురక్షితంగా ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

Spread the love

Related News

Latest News