[t4b-ticker]

హైదరాబాద్‌లో విషాదం.. ఫోన్ వాడొద్దన్నందుకు తండ్రి ముందే..

ప్రతిపక్షం, ఆగస్టు 27: హైదరాబాద్‌లోని ఉప్పుగూడ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఫోన్ ఎక్కువగా ఉపయోగించవద్దని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన 17 ఏళ్ల బాలిక రైలు కింద పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి కళ్ల ముందే ఈ ఘటన జరగడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

పోలీసుల వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన తేజస్విని ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తూ అర్ధరాత్రి వరకు మాట్లాడుతుండేది. ఈ విషయాన్ని గమనించిన తండ్రి పలుమార్లు ఆమెను మందలించినట్లు తెలుస్తోంది. తాజాగా కూడా ఫోన్ వినియోగంపై తండ్రి ఆమెను మందలించారు.

మందలించిన అనంతరం తేజస్విని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. క్షణికావేశంలో ఆమె ఏదైనా అఘాయిత్యానికి పాల్పడవచ్చన్న ఆందోళనతో తండ్రి వెంటనే ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఉప్పుగూడ రైల్వే ట్రాక్‌ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

అక్కడ గూడ్స్ రైలు వస్తుండగా తేజస్విని ఒక్కసారిగా పట్టాలపైకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి కళ్ల ముందే గూడ్స్ రైలు కింద పడి ఆమె మృతి చెందింది. ఊహించని పరిణామంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తేజస్విని తీసుకున్న ఈ విషాద నిర్ణయానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

చిన్న విషయాలకు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలతో తల్లిదండ్రులు మందలింపుతో పాటు వారి భావోద్వేగాలను అర్థం చేసుకునేలా మాట్లాడటం కూడా ముఖ్యమని చెబుతున్నారు.

Spread the love

Related News

Latest News