ప్రతిపక్షం, ఆగస్టు 31: మియాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుభాష్ చంద్రబోస్నగర్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న మల్లికార్జున్(16) ఇంట్లోనే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చదువుకు సంబంధించిన ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
చిన్న వయసులోనే విద్యార్థి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





























