[t4b-ticker]

సన్న వరికి 500 రూపాయల బోనస్: ఏఈఓ పవన్

ప్రతి పక్షం చండూరు ఆగస్టు 31: చండూరు మండలం లోని బోడంగిపర్తి గ్రామంలో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ అందిస్తున్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ వాన కాలంలో బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్‌ఎం-7715
వంటి ఏడు సన్న రకాలు సాగు చేసిన రైతులు సెప్టెంబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఏఈఓ పవన్ రైతులను కోరడం జరిగింది.

డీలర్ల వద్ద ప్రభుత్వం సూచించిన పై 7 రకాల సన్న వరి విత్తనాలు కొనుగోలు చేసి ఉంటే సంబంధిత డీలర్ ని సంప్రదించి తమ పేరును వెంటనే నమోదు చేయించుకోవాలి.అలాగే సొంత విత్తనాలు మరియు ఇతర మార్గాల ద్వారా సన్న రకం విత్తనాలు సేకరించి సాగు చేసిన రైతులు సంబంధిత ఏఈఓ దగ్గర నమోదు చేయించుకోని ప్రభుత్వం అందిస్తున్న 500 రూపాయల బోనస్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు బొమ్మల శంకర్, కట్కూరి సత్తయ్య , లింగస్వామి , బొల్లెద్దు గిరి తదితరులు పాల్గొనడం జరిగింది.

Spread the love

Related News

Latest News