[t4b-ticker]

ఢిల్లీలో భారీ ప్రమాదం.. కుప్పకూలిన హాస్టల్ భవనం, శిథిలాల్లో 50 మంది విద్యార్థులు?

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సత్య నికేతన్ ప్రాంతంలో ఓ హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కూలిన సమయంలో లోపల సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. దీంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

భవనం కూలిపోవడంతో పెద్ద ఎత్తున శిథిలాలు పేరుకుపోయాయి. వాటి కింద విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శిథిలాల కింద నుంచి ఇద్దరు విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం.

ప్రమాద స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరింత మంది విద్యార్థులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రాణాలతో ఉన్న వారిని వీలైనంత త్వరగా గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పోలీసులు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

భవనం ఏ కారణంగా కుప్పకూలిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సహాయక చర్యలు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారుల ప్రధాన దృష్టి శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపైనే ఉంది. ప్రమాద స్థలంలో ఉత్కంఠ నెలకొనగా, విద్యార్థుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Spread the love

Related News

Latest News