[t4b-ticker]

ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ చర్యలకు నిరసన

పసుపు నీళ్లతో శుద్ధి చేయడం పట్ల ఆందోళన

సిద్దన్నపేట చౌరస్తాలో బైఠాయించి నిరసన

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన

ప్రతిపక్షం, నంగునూరు, సెప్టెంబర్ 12: ఎర్రవల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పసుపు నీళ్లు చల్లడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు శనివారం నంగునూరు మండలంలోని సిద్దన్నపేట చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ నాయకుడు పంగ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకులు పసుపు నీళ్లు చల్లుతూ నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలకు తావులేదన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించే చర్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. కొద్దిసేపు చౌరస్తాలో బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బంగారి నర్సింలు, కందికట్ల రాజు, ఆదిమూలం మహేశ్, కందికట్ల రమేశ్, పాకాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News