[t4b-ticker]

లక్ష్మాపూర్ గ్రామంలో జోరుగా మట్టి తవ్వకాలు, రవాణా

అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు

అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికుల ఆగ్రహం

మట్టిదందకు కేరాఫ్ అడ్రస్ గా మూడు చింతలపల్లి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17, శామీర్ పేట: లక్ష్మాపూర్‌లో మట్టి దందాపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు పనిచేస్తున్నారా లేదా అసలు మూడు చింతలపల్లిలో రెవెన్యూ అధికారులు ఉన్నారా అంటూ నిమర్శలు వస్తున్నాయి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి రెవెన్యూ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో మట్టి తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు భారీ వాహనాలతో మట్టి తరలిస్తున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు కొనసాగుతున్న మట్టి తవ్వకాలు, రవాణా అంటూ ఆరోపణలుఅనుమతులు ఉన్నాయా? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారాన్ని అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మట్టి రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని కొందరు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉందిగతంలో లక్ష్మాపూర్ పరిధిలోని కొన్ని భూముల్లో భారీగా మట్టి తవ్వకాలు జరిగిన సందర్భాల్లో రెవెన్యూ, మైనింగ్ అధికారులు జరిమానాలు విధించినట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ అదే ప్రాంతంలో మట్టి తవ్వకాలు, రవాణా కొనసాగుతున్నట్లు వారు పేర్కొంటున్నారు కొందరు అధికారులు కొత్తగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మట్టి వాహనాలను పట్టుకుని చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ యథాతథంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. కేవలం అప్పుడప్పుడు వాహనాలను పట్టుకోవడం కాకుండా, మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరుతున్నారు.

ఫిర్యాదు చేస్తే బెదిరింపులా?
మట్టి తవ్వకాలు, రవాణాపై కొందరు స్థానికులు ఫిర్యాదులు చేస్తే వారి వివరాలు బయటకు వెళ్లి, ఫిర్యాదు చేసిన వారిని కొందరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు చింతలపల్లి మండల పరిధిలోని లక్ష్మాపూర్‌తో పాటు ఉద్దేమర్రి, అలియాబాద్, తుర్కపల్లి తదితర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న మట్టి తవ్వకాలు, రవాణాపై జిల్లా యంత్రాంగం సమగ్రంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై, అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.మట్టి తవ్వకాలు, రవాణాపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

Spread the love

Related News

Latest News