[t4b-ticker]

పేదలకు అండగా CMRF – అజ్జలాపురంలో లబ్ధిదారులకు చెక్కుల అందజేత.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి సహకారంతో రూ.1.35 లక్షల ఆర్థిక సాయం

ప్రతి పక్షం మర్రిగూడ, సెప్టెంబర్ 16: అజ్జలాపురం గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఉప్పునూతుల సత్తమ్మకు రూ.60,000, రామిడి మోహన్ రెడ్డికి రూ.39,000, బింరెడ్డి గారికి రూ.36,000 విలువైన CMRF చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు CMRF ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అజ్జలాపురం గ్రామ మాజీ సర్పంచ్ దండేట్కర్ అనసూయ అంజయ్య , ఎక్స్ డైరెక్టర్ ఉప్పునూతుల మల్లయ్య, కాంటెస్టెడ్ సర్పంచ్ ఎలిమినేటి సత్తిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, సిలివేరు యాదయ్య, వెంకటాచారి, సత్తెనారి రవీందర్, మల్లేష్, కృష్ణ, వెంకటేష్, నవీన్, మల్కాజీ, శ్రీశైలం, రామిడి వెంకట్ రెడ్డి, రామిడి ప్రతాప్ రెడ్డి, శంకర్, శేఖర్, రఘుమార్ రెడ్డి, పత్తి తిరుపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News