[t4b-ticker]

ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర నిధులను పూర్తిగా వినియోగించాలి

రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 16: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. అర్హులైన పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇళ్లు మంజూరు చేయాలని ఆయన అన్నారు.మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర నిధులు అనుసంధానమైన నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులకు కేంద్రం నుంచి అందాల్సిన సహాయం పూర్తిస్థాయిలో చేరేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇండ్లకు మూడు రంగుల రంగులు కలిపి వేయడం జరుగుతుందని అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) గుర్తును కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి లభించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోవాలని, అర్హులైన పేదలకు గృహ సదుపాయం అందేలా పారదర్శకంగా చర్యలు చేపట్టాలని అన్నారు.అర్హతే ప్రామాణికంగా ఇళ్ల ఎంపిక జరగాలని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్త మాజీ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ తో పాటు సీనియర్ నాయకులు జిల్లా కార్యదర్శి రంజిత్ రెడ్డి విజయకుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Spread the love

Related News

Latest News