ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్16: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కార్మిక ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ చేస్తున్న అరాచక పాలనను వ్యతిరేకంగా బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ. అధికారం రాకముందు రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి వాటిని అమలు చేయకుండా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజా సంఘాలు గాని కార్మిక సంఘాలు గాని తబనిరచనను తెలియజేయడం కోసం పిలుపునిచ్చిన ముందస్తు అరెస్టుల పేరుతో అర్ధరాత్రి ఇంట్లో చేరబడిలకు గురిచేసి వారిని అరెస్టు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు గడుస్తున్నప్పటికీ , కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన – పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది కార్మికుల హక్కులను అప్రాజాస్వామికంగా నిరాకరించటమేనని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇతర కార్మిక వర్గానికి చెందినవారు సమస్యలను పట్టించుకోవడంలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆందోళనా-పోరాటాలు నిర్వహిస్తున్న కార్మికులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు.ఈ సామూహిక దీక్ష ద్వారా కార్మిక ఉద్యమాలు అణిచితే నీకు కూడా కెసిఆర్ గతే పడుతుందని హెచ్చరించారు. ఈ దీక్షలకు రిటైర్డ్ ఉపాధ్యాయులు సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షులు బి కొండల్ రెడ్డి టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి సంఘీభావం ప్రకటించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి జిల్లా కోశాధికారి కే.నర్సమ్మ,ఎన్. నీలం బాబు,పుష్ప, దుర్గ, పొచయ్య, పద్మ, సుజాత, ఎల్లమ్మ, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.





























