[t4b-ticker]

పిట్ట బెదిరింపులకు భయపడను.. నీ అంతు చూస్తా రేవంత్ రెడ్డి: హరీష్ రావు ఫైర్

మోత్కూరులో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరికలు.

ప్రతిపక్షం, యాదాద్రి-భువనగిరి సెప్టెంబర్ 20: 22ఏ లో పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని, లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టావు రేవంత్ రెడ్డి, నేను ప్రశ్నిస్తే నా సంగతి చూస్తానంటావా.. పిట్ట బెదిరింపులకు భయపడనని, నీ అంతు చూస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హెచ్చరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం హరీష్ రావు మాట్లాడారు.రాష్ట్రంలో చాలా సర్వేలు సాగుతున్నాయని, అన్ని సర్వేలు కేసీఆర్ కే జై అంటున్నాయని అన్నారు. ఈ సర్వేలలో భాగంగానే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు.

రైతుల పాలన పోయి రాక్షసుల పాలన..

రైతుల పాలన పోయి రాక్షసుల పాలన సాగుతోందని విమర్శించారు. 2 గంటల నాసిరకం కరెంటుతో పంటలు ఎండిపోతున్నాయని, 3 పంటలకు రైతు బంధు ఎగనామం పెట్టారని, కరోనా వచ్చినా కేసీఆర్ పాలనలో రైతు బంధు ఆగలేదన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు చేసి దేవుడినే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అని, బస్తాకు రెండు కిలోల తరుగు పెట్టాడని మండిపడ్డారు.ఎల్ నినో పేరుతో రైతులను పూర్తిగా విస్మరిస్తున్నారని, కృష్ణా నదిలో నీళ్లు వచ్చినా సాగు నీళ్లు ఇవ్వడం లేదని, ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లు మిగిల్చారని అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేయడం లేదని, ఉచిత విద్యుత్ ఇవ్వడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని విమర్శించారు.

420 హామీలు అమలయ్యే వరకు వదలం..
బాండ్ పేపర్లు ఇచ్చి ఓట్లు వేసుకున్నారని, 420 హామీలు అమలయ్యే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. 30 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగనామం పెట్టారని, లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దన్నారు.ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టమని, రాసి పెట్టుకో బీర్ల అయిలయ్య, రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు హెచ్చరించారు. కృష్ణా వాటా, రీజినల్ రింగ్ రోడ్డు మీద కేంద్రం మీద పోరాటం చేయాలని ఎంపీలకు సవాల్ విసిరారు

Spread the love

Related News

Latest News