*మార్కండేశ్వర స్వామి దేవాలయం, గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు
ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 20: చండూరు మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం, శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణనాథుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.
వేడుకల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మండపం ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ (అన్నదాన) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
అన్న సంతర్పణ నిర్వహణకు సహకరించిన వారు గంజి యాదగిరి, జూలూరు ఆంజనేయులు, జూలూరు శ్రీనివాసులు, చిలుకూరి శ్రీనివాసులు, పున్న వెంకటేశ్వర్లు. అన్నదాన కార్యక్రమానికి నాయకులు హాజరై భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.




























