*అభినందనలు తెలిపిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనా రెడ్డి.
ప్రతిపక్షం, చౌటుప్పల్ సెప్టెంబర్ 19: చౌటుప్పల్ సింగిల్ విండో నూతన చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన ఈడుదుల మస్తాన్ బాబును, పాలకవర్గ సభ్యులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు & వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి అభినందించారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో చైర్మన్ గా ఎన్నికైన మస్తాన్ బాబు, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. రైతు బాంధవుడు, జననేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో రైతులకు, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.






























