లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం.. మంత్రి పొంగులేటి, టీపీసీసీ చీఫ్ అరెస్ట్

ప్రతిపక్షం, జూలై 22: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ‘ఛలో లోక్‌భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు లోక్‌భవన్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంతో లోక్‌భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love

Related News

Latest News