కపాస్ క్రాంతి పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమం

*అధిక సాంద్రత సాగుతో పత్తి అధిక దిగుబడి – మండల వ్యవసాయ అధికారి మల్లేష్.

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 08 : చండూరు మండలం లక్కినేని గూడెం గ్రామంలో కపాస్ క్రాంతి పథకంలో భాగంగా రైతులకు అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. మహేష్ లు రైతులకు పత్తి సాగు మెళుకువలను వివరించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మల్లేష్ మాట్లాడుతూ అధిక సాంద్రత, దగ్గర దగ్గరగా విత్తే పత్తి సాగు చేయడం వల్ల పత్తి పంట ఒకేసారి చేతికి వస్తుందని తెలిపారు. దీని ద్వారా పంట త్వరగా పూర్తయి అదే పొలంలో ఇంకొక పంటను వేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని అన్నారు.ఈ విధానంలో ఒక ఎకరానికి 40 వేల మొక్కలు ఉంటాయని, ఇది సాధారణంగా సాగు చేసే పత్తి విధానం కంటే మూడు రెట్లు ఎక్కువ మొక్కలు ఉంటాయని తెలిపారు.

సాధారణ పత్తి సాగులో వచ్చే దిగుబడి ఈ విధానంలో కూడా ఒకేసారి రావడం జరుగుతుందని వివరించారు.ప్రస్తుతం పత్తి పంట పెట్టకు గురైందని, రైతు సోదరులు రెండు శాతం యూరియా లేదా మల్టీకే వంటి పోషకాలను స్ప్రే చేసుకోవాలని సూచించారు. వచ్చే యాసంగి సీజన్ లో బోర్ల కింద ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేసుకోవద్దని, దానికి బదులుగా ఆరుతడి పంటలైన పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న వంటి పంటలు వేసుకోవడం మేలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాశం వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News