Trending Now

దేశ రక్షణకు, సంక్షేమ అభివృద్ధికి మోడీనే రక్ష..

బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణరెడ్డి

ప్రతిపక్షం, మంథని(రామగిరి), మే 02 : దేశ రక్షణకు, సంక్షేమ అభివృద్ధికి మోడీనే రక్ష అని బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణరెడ్డి అన్నారు. గురువారం సెంటనరీ కాలనీలో టౌన్ అధ్యక్షుడు తీగల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డితో కలిసి చల్లా నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 500 సంవత్సరాల హిందువుల కల అయినటువంటి అయోధ్య మందిరాన్ని నిర్మించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దేననీ, ప్రజల సంక్షేమం కొరకు అయోధ్య రాముని అభిషేకించిన అక్షంతలను దేశంలోని మారుమూల పల్లెల్లోని ప్రతి ఇంటి వరకు అందజేసి హిందువుల మైనో ధైర్యాన్ని మేల్కొల్పారని ఆన్నారు.

మోడీ పాలనలో దేశ రక్షణ కట్టుదిట్టం చేయబడిందని, దేశంలో అల్లకల్లోలాలు సృష్టించాలనీ చూసే వారికి సర్జికల్ స్ట్రైక్ తో భారత్ వైపు చూడాలంటే వనికి పోయేలా గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. అదే కాకుండా ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపి జీ-20 సదస్సును కాశ్మీర్ లో నిర్వహించరన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దేననిన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ఓటు దండుకునే ప్రయత్నం చేస్తుందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని, రాజ్యాంగాన్ని మారుస్తారని భోగస్ ప్రచారాలను నమ్మవద్దని, మోడీ అంటే కచ్చితమైన గ్యారింటికి నిలువెత్తు నిదర్శనమని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.

నమ్మిన వారికి మొండి చేయి చూపించి రాజకీయ లబ్ధి పొందే శ్రీధర్ బాబు వాగ్దానలను నమ్మవద్దని, అందుకు ప్రత్యక్ష నిదర్శంగా నిలుస్తున్న నాకు టికెట్ ఇవ్వకుండా కోట్లు ఖర్చు చేపించి, కోట్ల రూపాయిలు ఖర్చు చేపించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వాఖ్యానించారు. మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వకున్నా, బీజేపీ అధినాయకత్వం నరేంద్రమోడీ, జేపీ నాడ్డ, అమిత్ షా లా త్రయం తనను నమ్మి బీజేపీ టికెట్ అందజేశారని, తనకు బీజేపీ టికెట్ ఇవ్వడంతో దేశంలోని అంబేద్కర్ వారసులు స్వాగతిస్తూ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని, బీజేపీ సమర్థవంతమైన పాలన దేశానికి రక్ష అని తనకు ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల సంక్షేమ అభివృద్ధి కృషి చేస్తానని గోమాస శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు కొండ్రు లక్ష్మణ్, బీజేవైఎం మాజీ మండల అధ్యక్షుడు గోవర్ధనగిరి ధీరజ్ కృష్ణ, తొట్ల రాజ్ కుమార్, మహేష్, మెరుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News