Trending Now

ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనుకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

కేసీఆర్‌ సంతాపం..

ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం చంద్రశేఖర్​రావు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. లాస్య నందిత మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. నందిత ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీశ్​రావు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి దగ్గరుండి తరలించారు. నందిత మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పలువరు నేతలు సంతాపాన్ని తెలిపారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

బీఅర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర విషాదమని, తండ్రి అకాలమరణంతో చిన్న వయసులో.. విద్యాధికురాలైన ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కిందని, అంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని నిరంజన్ రెడ్డి దేవుని ప్రార్ధించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Spread the love

Latest News